Hyderabad, ఏప్రిల్ 3 -- Karate Kid Legends Telugu Trailer Released: భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్రాంచైజీలలో కరాటే కిడ్ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమా సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్‌: లెజెండ్స్ తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

కరాట్ కిడ్ లెజెండ్స్ సినిమాను 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఆరో సినిమాగా వస్తున్నదే కరాటే కిడ్ లెజెండ్స్. అయితే, ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరో భాగంలో రెండు ఐకానిక్‌ పాత్రల్లో పాపులర్ స్టార్స్ జాకీ చాన్, రాల్ఫ్ మాకియో కలిసి తొలిసారి స్క్రీన్‌పై కలిసి కనిపించనున్నారు.

ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో గురువుగా యాక్షన్ హీరో జాకీ చాన్ ఒక్కరే ఉండేవారు. కానీ, ఈ న్యూ పార్ట్‌లో ...