Hyderabad, ఫిబ్రవరి 20 -- వడియాలు, అప్పడాలు మన భోజనంలో భాగం. పప్పు, సాంబారు తింటున్నప్పుడు పక్కన వడియాలు ఉండాల్సిందే. ఇక్కడ మేము పిల్లలకు నచ్చేలా క్రిస్పీగా ఉండే కారప్పూస వడియాలు ఇచ్చాము. చిన్నపిల్లలు కూడా వీటిని చాలా సులువుగా తినగలరు. దీని కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఎండ కూడా అవసరం లేదు. ఇది ఒక రోజంతా ఫ్యాన్ గాలి కింద పెడితే చాలు ఆరిపోతాయి. ఆరు నెలలపాటు తాజాగా ఉంటాయి. కారప్పూస వడియాలు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

బియ్యం పిండి - ఒక కప్పు

సగ్గుబియ్యం - పావు కప్పు

పచ్చిమిర్చి - ఐదు

నీళ్లు - సరిపడినన్ని

ఉప్పు - రుచికి సరిపడా

ఇంగువ - చిటికెడు

నిమ్మరసం - ఒక స్పూను

1. కారప్పూస వడియాలు చేసేందుకు ముందుగా బియ్యప్పిండిని తీసి ఒక గిన్నెలో వేసుకోండి.

2. ఇప్పుడు మిక్సీలో పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసి మెత్తగా పొడి చేసుకోండి.

3. ఆ పొడిని బియ్...