భారతదేశం, ఫిబ్రవరి 17 -- దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. బాహుబలి 1,2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్‍కు తీసుకెళ్లారు. ప్రపంచమంతా తెలుగుతో పాటు భారత సినీ ఇండస్ట్రీ వైపు తిరిగిచూసేలా చేశారు. అయితే, రాజమౌళి చిత్రాల్లో లాజిక్‍లు ఉండవని బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ అన్నారు. స్టోరీటెల్లింగ్ గురించి చెబుతూ ఈ కామెంట్ చేశారు. లాజిక్ లేకున్నా రాజమౌళి సినిమాలు అంతలా ఎందుకు సక్సెస్ అవుతున్నాయో వివరించారు.

రాజమౌళి చిత్రాల్లో లాజిక్‍లు ఎక్కడ ఉంటాయని కరణ్ జోహార్ అన్నారు. యాట్యూబ్ ఛానెల్ కోమల్ నథాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ ఈ కామెంట్లు చేశారు. చిత్రాల్లో లాజిక్‍ల గురించి వచ్చిన ప్రశ్నకు స్పందించారు. సినిమాల్లో లాజిక్‍లు అవసరం లేదని, ప్రేక్షకులను నమ్మించడమే ముఖ్యమని కరణ్ అన్నారు. ముందు తాము తెరకెక్కిస్తున్న దానిపై దర్శకులు వ...