భారతదేశం, మార్చి 19 -- Kapu Corporation Loans : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీపై కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తుంది. బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులకు సబ్సిడీపై రుణాలు ఇస్తున్నారు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అర్హులైన వారు ఈ నెల 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రెండు విధాలుగా రుణాలు అందిస్తున్నారు.

కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (APSKWDC) రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కాపు కులాల వారికి "ఆర్థిక సహాయ కార్యక్రమం- చంద్రన్న స్వయం ఉపాధి"లో భాగంగా రుణసదుపాయం అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 2,50,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది...