భారతదేశం, జనవరి 15 -- తెలుగు వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి నాడు అందరూ పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు చేసుకోవడం, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడిపందాలు ఇలా ఎన్నో ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ సందడి అంతా ఊర్లోనే ఉన్నట్టు సరదాగా, సంతోషంగా పండుగను జరుపుకుంటారు.

సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటారు. కనుమ పండుగ నాడు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. సాయంత్రం ఊరేగింపు చేస్తారు. అయితే కనుమ నాడు పశువులకు ఇష్టమైన ఆహారాన్ని కూడా వండి పెడతారు. ఇక ఇది ఇలా ఉంటే, కనుమ నాడు పొలిమేర దాటకూడదని పెద్దలు అంటారు. అయితే అలా ఎందుకు చెబుతారు? కనుమ నాడు పాటించాల్సినవి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కనుమ నాడు ప్రయాణం చేస్తే కీడు జరిగే అ...