Hyderabad, ఫిబ్రవరి 13 -- Kannappa Prabhas Remuneration: అత్యంత భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ కన్నప్ప. మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్నాడు. రూ.140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ లాంటి వాళ్లు కూడా అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమా కోసం వాళ్లు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

కన్నప్ప మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఈ మధ్యే ప్రభాస్ లుక్ కూడా రివీలైంది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ లాంటి వాళ్లు నటించడం, వాళ్ల రెమ్యునరేషన్ వివరాలపై ది హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడాడు. అయితే ఈ సినిమా కోసం వాళ్లు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన తండ్...