భారతదేశం, జనవరి 27 -- మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప చిత్రం చేస్తున్నారు. శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రను ఈ మూవీలో విష్ణు పోషిస్తున్నారు. ఈ మైథాలజీ చిత్రానికి ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. దీంతో ఈ మూవీకి క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉంటారోననే ఆసక్తి విపరీతంగా నెలకొంది. ఈ ఉత్కంఠ వీడనుంది. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్ ఖరారైంది.

కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 3వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జనవరి 27) అధికారికంగా వెల్లడించింది. నుదిటన నామాలు పెట్టుకున్న ప్రభాస్ కళ్లు, త్రిశూలం ఉన్న ఓ కొత్త పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఫిబ్రవరి 3న లుక్ పూర్తిగా రివీల్ చేస్తామంటూ సోష...