భారతదేశం, ఏప్రిల్ 9 -- మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రను ఈ మైథలాజికల్ మూవీలో ఆయన పోషించారు. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో విడుదల ఎప్పుడు అనే ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో కన్నప్ప రిలీజ్‍కు డేట్ ఖరారైంది. ఈ విషయాన్ని మంచు విష్ణు నేడు (ఏప్రిల్ 9) వెల్లడించారు.

కన్నప్ప సినిమాను జూన్ 27వ తేదీన విడుదల చేస్తామని మంచు విష్ణు నేడు ప్రకటించారు. కొత్త విడుదల తేదీ ఉన్న ఈ చిత్రం పోస్టర్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. ఆయనను మంచు విష్ణు, మంచు మోహన్ బాబు కలిశారు.

యూపీ సీఎంను తాము కలిసి ఫొటోలను నేడు సోషల్ మీడియాలో షేర్ చేశారు మంచు విష్ణు. "నా ఫేవరెట్ హీరోల్లో ఒకరైన యోగి ఆ...