భారతదేశం, మార్చి 24 -- మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విష్ణు. ఈ మైథాలజీ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తన్నారు. శివుడి పరమభక్తుడు కన్నప్ప పాత్రను విష్ణు పోషించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్‍లాల్, అక్షయ్ కుమార్ కూడా ఈ మూవీలో నటిస్తుండటంతో హైప్ ఎక్కువగా ఉంది. అయితే, కన్నప్ప చిత్రంపై ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈ మూవీలో నటించిన సీనియర్ యాక్టర్ రఘుబాబు తాజాగా కొన్ని కామెంట్లు చేశారు.

కన్నప్ప సినిమాపై ట్రోల్ చేసే వారు శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారని రఘుబాబు అన్నారు. ఓ ఈవెంట్‍లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు. "ఈ సినిమా గురించి ఏవరైనా ట్రోల్ చేశారంటే.. చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండ...