Hyderabad, ఫిబ్రవరి 28 -- Akshay Kumar About Rejecting Kannappa Movie Offer: మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక వస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. బాలీవుడ్ డైరెక్ట్ ముకేష్ కుమార్ సింగ్ కన్నప్ప మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా తెలుగులో పరిచయం కానుంది.

అలాగే, కన్నప్ప సినిమాలో భారీ తారాగాణం నటిస్తోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మధుబాల, శివరాజ్ కుమార్, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ వంటి స్టార్ క్యాస్ట్ కన్నప్ప మూవీలో కనిపించి కనువిందు చేయనున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్‌తో కన్నప్ప సినిమాకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే తాజాగా కన్నప్ప టీజర్‌ను రిలీజ్ చేశారు. ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో 'కన్నప్ప' టీజర్‌ను ఆవిష్కరించారు. బా...