భారతదేశం, మార్చి 14 -- Kannada OTT: శుక్ర‌వారం ఒక్క‌రోజే రెండు క‌న్న‌డ సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చాయి. హిర‌ణ్య మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోండ‌గా...ఫారెస్ట్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది.

అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఫారెస్ట్ మూవీ శుక్ర‌వారం స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫారెస్ట్ మూవీలో చిక్క‌న్న‌, అనీష్ తేజేశ్వ‌ర్‌, రంగాయ‌న ర‌ఘు, శ‌ర‌ణ్య శెట్టి కీల‌క పాత్ర‌లు పోషించారు. జ‌న‌వ‌రి నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

ఫారెస్ట్ మూవీకి చంద్ర‌మోహ‌న్ చింతాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.చంద్ర‌మోహ‌న్ తెలుగు డైరెక్ట‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో శ‌ర్వానంద్‌తో రాధ అనే సినిమా చేశాడు. అడ‌విలో ఓ స్మ‌గ్ల‌ర్ దాచిపెట్టిన కోట్ల రూపాయ‌ల ...