భారతదేశం, మార్చి 23 -- Kannada Movie: క‌న్న‌డ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ సీతారాం బెనోయ్ కేస్ నంబ‌ర్ 18 తెలుగులోకి వ‌చ్చింది. శ‌నివారం యూట్యూబ్‌లో రిలీజైన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క‌న్న‌డ మూవీలో విజ‌య్ రాఘ‌వేంద్ర హీరోగా న‌టించాడు. దేవీ ప్ర‌సాద్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2021లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ క‌న్న‌డ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ట్విస్ట్‌ల‌తో పాటు క‌థ‌, విజ‌య్ రాఘ‌వేంద్ర యాక్టింగ్ అభిమానుల‌ను మెప్పించాయి. సీతారాం బెనోయ్ మూవీలో అక్ష‌త హీరోయిన్‌గా న‌టించింది. గ‌గ‌న్ బ‌దేరియా మ్యూజిక్ అందించాడు. విజ‌య్ రాఘ‌వేంద్ర కెరీర్‌లో 50వ మూవీగా సీతారాం బెనోయ్ రిలీజైంది. ఈ మూవీ క‌న్న‌డంతో పాటు తెలుగు వెర్ష‌న్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

సీతారాం బెనోయ్ ఓ నిజాయితీప‌రుడైన పోలీస్ ఆఫీస‌ర్‌. అర‌కు పోలీస్ స్టేష‌న్‌...