Telangana,hyderabad, ఏప్రిల్ 11 -- కంచ గచ్చిబౌలి భూముల వేలంతో కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద స్కామ్ కు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. లేని మార్కెట్ వాల్యూను సృష్టించి. బ్యాంక్ నుంచి ఇప్పటికే రూ. 10 వేల కోట్ల వరకు లోన్ తీసుకుందన్నారు. భూములకు సంబంధించిన ప్రభుత్వం వద్ద సరైన పత్రాలు లేకుండానే ఇదంతా చేస్తుందన్నారు.

ఈ భూముల వేలం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద స్కామ్ కు తెరలేపిందన్నారు. ఓ బీజేపీ ఎంపీ సాకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. చేస్తున్న తప్పులన్నీ రేవంత్ రెడ్డికి తెలుసని చెప్పారు.

"కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల్లో పెద్ద కుంభకోణం ఉంది.ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీకి కాంట్రాక్ట్ ...