భారతదేశం, ఏప్రిల్ 1 -- కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేశ్ కేంద్రమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు.

పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని ఎంపీలు కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచ గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరం అని వివరించారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని చెప్పారు. ఈ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నారని ఎంపీలు ఆరోపించారు.

హెచ్‌సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరా...