భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాల దందా కేసు మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిపై వేటు పడింది. మరింత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ దళారి ఫోన్ నుంచి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ సిబ్బంది ప్రమేయంతోనే ఈ దందా జరిగినట్లు నిర్థారణకు వచ్చారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

ఇటీవల అమ్మవారి ఆలయ ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి. వీఐపీ దర్శనం చేయిస్తామని కొందరు ప్రైవేట్ వ్యక్తులు భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరికి ఆలయ ఉద్యోగులు, సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల వద్ద వాటాలు తీసుకొని.. వారికి సహకరిస్తున్నారని తెలుస్తోంది. రద్దీ వేళల్లోనూ అరగంటలో దర్శనం చేయిస్తున్నారు. దీంతో సామాన...