భారతదేశం, ఫిబ్రవరి 21 -- కామారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం దక్కలేదు. గుండెపోటుతో బాలిక చనిపోయిందని వైద్యులు చెప్పారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14).. ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. చదువుకోసం కామారెడ్డిలోనే ఉంటోంది. ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాఠశాల సమీపంలో ఛాతీ నొప్పి వచ్చి కుప్పకూలిపోయిందని స్థానికులు తెలిపారు.

అటుగా వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు శ్రీనిధిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు సీపీఆర్ చేశారు. ప్రాథమిక చికిత్స అందించారు. కానీ శ్రీనిధి స్పందించకపోవడంతో వేరే ఆసుపత్రికి తరల...