భారతదేశం, మార్చి 30 -- కామారెడ్డి జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం ఈ విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన మౌనిక (26) ముగ్గురు పిల్లలు మైథిలి (10), అక్షర (9), వినయ్​(7)లతో కలిసి శనివారం మధ్యాహ్నం పొలం దగ్గరకు వెళ్లారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక బట్టలు ఉతుకుతుండగా.. పిల్లలు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు.

చెరువులో భారీ గుంత ఉండడంతో పిల్లలు అందులో మునిగిపోయారు. మౌనిక వారిని కాపాడేందుకు వెళ్లి ఆమె కూడా నీట మునిగింది. సాయంత్రం దాటినా నలుగురు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అక్కడ దుస్తులు కనిపించాయి. కానీ ఎవరి ఆచూకీ కనిపించ లేదు.

దీంతో కు...