భారతదేశం, జనవరి 28 -- Kamaredy Crime: కామారెడ్డిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. బిక్నూరు మండలం మళ్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ (42), సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఉన్న రెడ్డి ఘనపూర్ లో ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థలో మూడేళ్లుగా సీఈఓ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య లక్ష్మి (40) వారి ఇద్దరు పిల్లలతో కలిసి, తన స్వంత గ్రామంలోనే ఉంటూ పిల్లలను చదివిస్తుంది.

గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీ లో పనిచేస్తున్న లక్ష్మి, బిక్నురు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. పార్టీలో పని చేస్తుండగా, అదే మండలానికి చెందిన ఎస్సి మోర్చా అధ్యక్షుడు కడారి రాకేష్ (28) తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త, వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి త...