భారతదేశం, ఫిబ్రవరి 4 -- కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ నెలలో.. కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో.. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను పెంచుతామని.. అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌తో పాటు.. బీసీ సబ్ ప్లాన్‌ను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. బీసీల అభివృద్దికి ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వాగ్ధానం చేసింది. ప్రతి జిల్లాకు బీసీ భవన్‌, అర్హులైన బీసీలకు రుణాలివ్వడం, ప్రతీ మండలానికి బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు పెద్దపీట వ...