భారతదేశం, ఏప్రిల్ 14 -- దళితుల బట్టలు విప్పి అరెస్టు చేసేంత ధైర్యం పోలీసులకు ఎవరిచ్చారు? ఎవరి దన్ను చూసుకొని పోలీసులు విర్రవీగుతున్నారు? అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా.. అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగమా? అని కవిత ప్రశ్నించారు. దళితులను అవమానించడమే ప్రజా పాలనా.. అని నిలదీశారు.

'కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో.. దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. బట్టలు విప్పి మరి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. బాధ్యులైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వా...