భారతదేశం, మార్చి 29 -- డాక్ట‌ర్లు...యాక్ట‌ర్లుగా మారే ట్రెండ్ టాలీవుడ్‌లో పెరిగిపోయింది. సాయిప‌ల్ల‌వి, శ్రీలీల‌తో ప‌లువురు హీరోయిన్లు వైద్య విద్య అభ్య‌సిస్తూనే హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఆ లిస్ట్‌లో కామాక్షి భాస్క‌ర్ల కూడా ఉంది. తెలుగులో హీరోయిన్‌గానే కాకుండా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ ప్ర‌తిభ‌ను చాటుకుంటోంది.

ప్ర‌స్తుతం తెలుగులో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతన్న హారర్ థ్రిల్లర్ మూవీ 12A రైల్వే కాలనీలో న‌టిస్తోంది. ఇటీవలే నవీన్ చంద్రతో కొత్త సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాది. మరో వైపు బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ పోలిమేర మూడో పార్ట్ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్న‌ది. మ‌రికొన్ని సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న‌ట్లు కామాక్షి తెలిపింది.

కామాక్షి భాస్క‌ర్ల మాట్లాడుతూ.. '12 ఏ రైల్వే కాల‌నీ, పొలిమేర 3తో పాటు న‌వీన్ చంద్ర మూవీస్‌ల‌లో నేను విభిన...