భారతదేశం, ఫిబ్రవరి 1 -- తెలంగాణలోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కింద దాదాపు 350 యూజీ, పీజీ వైద్య, దంత, నర్సింగ్, పారామెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు 105 పోస్టులు అవసరం. వాటిని భర్తీ చేయాలి. కానీ ప్రస్తుతం 40 నుంచి 45 మందే పనిచేస్తున్నారు. జాయింట్‌ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌ వంటి పోస్టులు ఉండాలి. వైస్ ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్‌ పోస్టులకు మినహా.. మిగతా వాటికి ఇప్పటికీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు.

ఫలితంగా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పాలన గాడి తప్పుతోంది. పదేళ్లు గడుస్తున్నా కీలక విభాగాలను గాడినపెట్టే వారు లేరు. గతేడాది జూన్‌లో వీసీ నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చినా.. ఇప్పటివరకు ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పరీక్షల నిర్వహణ విభాగంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ పోస్టులో ఎంబీబీఎస్‌ చేసిన వారు ఉండాలి. కానీ దంత వైద్యుడినే కొన్నేళ్...