భారతదేశం, ఫిబ్రవరి 27 -- Kaliyugam Pattanam lo: బ‌ల‌గం సినిమాలో హీరో మేన‌త్త పాత్ర‌లో జీవించింది రూప‌ల‌క్ష్మి . ల‌చ్చవ్వ‌గా త‌న న‌ట‌న‌తో ఆడియెన్స్ చేత క‌న్నీళ్లు పెట్టించింది. రూప‌ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో క‌లియుగం ప‌ట్ట‌ణంలో పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. చిత్రా శుక్లా మ‌రో ముఖ్య పాత్ర‌ను పోషిస్తోంది. క‌లియుగం ప‌ట్ట‌ణంలో ఈ మూవీకి ర‌మాకాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌తో పాటు కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లేను ఆయ‌నే అందిస్తోన్నారు. మార్చి 22నక‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీ రిలీజ్ కాబోతోంది.

సరికొత్త పాయింట్‌తో చ‌క్క‌టి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా క‌లియుగం ప‌ట్ట‌ణంలో ఉండ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇద‌ని అన్నా...