భారతదేశం, ఫిబ్రవరి 16 -- Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా మారుతాయని పేర్కొంది.

కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పుల్లో 12 ఏళ్లలో ప్రభుత్వం భరించాల్సింది రూ.2.66 లక్షల కోట్లకు చేరనుంది. అసలు కాకుండా వడ్డీలతో కలిపి రుణాల తిరిగి చెల్లింపులకే రూ.1.41 లక్షల కోట్లు అవసరం అవుతాయని లెక్క తేల్చారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పెనుభారంగా మారనుందని కంప్టోలర్ అండ్ ఆడిటర్ జన రల్ నివేదిక స్పష్టం చేసింది. "2022 మార్చి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కార్ప...