భారతదేశం, ఫిబ్రవరి 7 -- Kaleswaram: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం మహత్తర ఘట్టానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం జరగనుంది.

1982లో మొదటిసారి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ జరిగిన సమయంలో ఇక్కడ మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆ తరువాత మళ్లీ 42 ఏళ్ల తరువాత ఇప్పుడే మహాకుంభాభిషేక వేడుకలు జరుగుతున్నాయి.

మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శృంగేరి జగద్గురువులు భారత తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి, తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆలయ అధికారులు తెలిపారు. కాగా కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్ల...