భారతదేశం, మార్చి 17 -- అభం శుభం తెలియని చిన్న పిల్లలు వారు. ఒక బాలుడు యూకేజీ చదువుతుంటే.. మరో బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. అంత చిన్న పిల్లలు సరిగా చదవడం లేదని.. భవిష్యత్తులో బాగా బతకలేరని ఆ తండ్రికి ఎందుకు అనిపించిందో తెలీదు. కానీ.. వారిని అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది.

ఓఎన్జీసీ ఉద్యోగి వానపల్లి చంద్రకిశోర్‌ కాకినాడ రూరల్ తోట సుబ్బారావునగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన ఈ నెల 14న తన ఇద్దరు పిల్లలను చంపేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. చంద్రకిశోర్‌ ధైర్యవంతుడని, పిల్లలంటే ఎంతో ప్రేమని అతని బంధువులు చెబుతున్నారు. కానీ ఎందుకిలా చేశారనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.

చంద్రకిశోర్‌ అందరికీ ధైర్యం చెబుతుండేవారని ఆయన బావమరిది ఉమాశంకర్‌ అంటున్నారు. తన పిల్లల్ని...