ఆంధ్రప్రదే,విశాఖపట్నం, మార్చి 15 -- కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపేసిన తండ్రి (ఓఎన్‌జీసీ ఉద్యోగి). ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న క‌ట్టుకున్న భ‌ర్త‌ను. ప‌డి ఉన్న‌ క‌న్న‌పిల్ల‌లను చూసి ఇల్లాలు అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయింది. త‌న ఇద్ద‌రు పిల్ల‌లు బాగా చ‌ద‌వటం లేద‌ని. పోటీ ప్ర‌పంచంలో పోటీ ప‌డ‌లేకపోతున్నార‌ంటూ రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది.

ఈ ఘ‌ట‌న కాకినాడ రూర‌ర్‌లోని తోట సుబ్బారావు న‌గ‌ర్‌లో శుక్ర‌వారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప‌శ్చిమగోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం చెందిన వాన‌ప‌ల్లి చంద్ర‌కిశోర్ కాకినాడలోని వాక‌ల‌పూడిలోని ఓఎన్‌జీసీ ఆఫీసులో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా ప‌ని చేస్తున్నాడు. న‌గ‌రంలోని సుబ్బారావు న‌గ‌ర్‌లో ఓ ఫ్లాట్‌లో న...