ఆంధ్రప్రదేశ్,కాకినాడ, జనవరి 31 -- ప్రియురాలి చేతిలో ప్రియుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేత‌ర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమైంది. కాకినాడ సిటీలోని టిడ్కో ఇళ్ల స‌ముదాయంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం. రావుల‌పాలేనికి చెందిన మునిస్వామి లావ‌ణ్య‌కు కొన్నేళ్ల క్రితం చిత్తూరుకు చెందిన బాలుతో వివాహ‌మైంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోయారు. నాలుగేళ్ల నుంచి లావణ్య రావుల‌పాలెంలో ఉంటుంది. అక్క‌డ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పెనుగొండ మండ‌లం చిన‌మ‌ల్లానికి చెందిన‌ గుడాల చంద్ర‌శేఖ‌ర్ స్వామి (30) అనే వ్య‌క్తితో ప‌రిచయం ఏర్ప‌డింది.

ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారి స‌హ‌జీవ‌నానికి దారితీసింది. వీరిద్ద‌రి బంధం ఇలానే కొన‌సాగుతుండ‌గా. రెండు నెల‌ల క్రితం లావ‌ణ్య‌కు కాకినాడ‌కు చ...