భారతదేశం, ఫిబ్రవరి 9 -- కాకినాడ జిల్లా యు.కొత్త‌ప‌ల్లి మండ‌లంలోని ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠ‌శాల‌ ఉంది. ఆ పాఠ‌శాల‌లో న‌డికి సుధీర్ అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. అతను ఐదో త‌ర‌గ‌తి విద్యార్థినుల‌తో గ‌త కొన్ని రోజులుగా అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. త‌న సెల్‌ఫోన్‌లోని అస‌భ్యక‌ర వీడియోల‌ను విద్యార్థినుల‌కు చూపించి, వారి శరీర భాగాలను అసభ్యకరంగా తాక‌డం వంటి ప‌నులు చేసేవాడు. విసిగిపోయిన విద్యార్థినులు ఉపాధ్యాయుడు త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు.

ఉపాధ్యాయుడి కీచ‌క బాగోతం తెలిసిన త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ల్లిదండ్రులు గురువారం పాఠ‌శాల‌కు వెళ్లి.. ఇన్‌ఛార్జి ప్ర‌ధానోపాధ్యాయుడు ఏవీ శ్రీ‌నివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న ఈ విష‌యాన్ని మండ‌ల విద్యా శాఖ అధికారులు బి.వేణుగోపాల్‌, జి.పైడిరాజుల‌కు నివేది...