భారతదేశం, మార్చి 23 -- Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారుల‌పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విష‌యం తెలుసుకున్న చిన్నారుల త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు, స్థానికులు ఆ దుర్మార్గుడికి దేహ‌శుద్ధి చేశారు. అనంత‌రం పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల చ‌ర్యల‌ు అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఘ‌ట‌న కాకినాడ జిల్లా పెద్దాపురం ప‌ట్టణంలోని ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం కామేశ్వర‌రావు (55 ఏళ్ల) బంగారం ఆభ‌ర‌ణాల‌ త‌యారీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయ‌న భార్య ఐదు నెల‌ల క్రితం మృతి చెందింది. అదే వీధిలో నివాసం ఉంటున్నపేద కుటుంబాల‌కు చెందిన ఇద్దరు చిన్నారుల‌పై కామేశ్వరరావు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఇద్దరిలో ఒక బాలికకు 7 ఏళ్లు కాగా, రెండో బాలిక‌కు 10 ఏళ్ల వ‌య‌స్సు ఉంటుం...