భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అదికాస్త ఇంట్లో చెప్పకుండా యువకుడితో వెళ్లే వరకు వచ్చింది. ఈ ఘ‌ట‌న కాకినాడ జిల్లా పెద్దాపురం మండ‌లంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప్ర‌కాశం జిల్లా ముండ్ల‌మూరు మండలం మారెళ్ల గ్రామానికి చెందిన క‌న‌ప‌ర్తి అశోక్ (22) కూలి ప‌నులు చేస్తుంటాడు. ప‌నుల కోసం ఏడాది కిందట కాకినాడ జిల్లాకు వచ్చాడు. ఈ క్ర‌మంలో అశోక్‌కు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఇంటర్ చ‌దువుతున్న బాలిక‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రు ఇన్‌స్ట్రాగ్రామ్‌లోనూ, ఫోన్‌ల్లోనూ ఛాటింగ్ చేసుకోవ‌డం, త‌ర‌చూ మాట్లాడుకోవ‌డం జ‌రిగేది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి బాలిక...