వరంగల్,తెలంగాణ, ఫిబ్రవరి 8 -- కాకతీయ యూనివర్సిటీలో గ్యాంగ్ వార్ జరిగింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. కేయూ కామన్ మెస్ లో ఈ ఘటన జరగగా.. గొడవకు పాల్పడిన 22 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కేయూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.వి.రాంచంద్రం, ఇతర ఉన్నతాధికారులు కామన్ మెస్ ను విజిట్ చేసి విచారణ జరిపారు.

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని కామన్ మెస్ లో శుక్రవారం మధ్యాహ్నం సయమంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ కు చెందిన సీనియర్, జూనియర్ విద్యార్థులు లంచ్ కోసం వెళ్లారు. అక్కడ భోజనం చేసే సమయంలో విద్యార్థుల మధ్య సీనియర్, జూనియర్ వార్ మొదలైంది. మాటామాటా పెరగడంతో ఇరువర్గాల విద్యార్థులు ఘర్షణకు దిగారు. విద్యార్థులు ఒకరిపై ఒకరు ప్లేట్లు, చేతికందిన వస్తువులతో దాడులు చేసుకు...