భారతదేశం, ఏప్రిల్ 11 -- వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో కిటెక్స్ కంపెనీ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. వివిధ విభాగాల్లో మొత్తంగా 25 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఐదు రోజుల కిందట ప్రకటన విడుదల చేయగా.. రెండు వారాల్లోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అందులో సూచించింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు తమ కంపెనీ వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పిస్తే.. దాని ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో 2017లో గత రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు అందించే ఉద్దేశంతో దాదాపు రూ.1,350 కోట్లతో 1,150 ఎకరాల్లో ఈ పార్కు పనులు మొదలు పెట్టింద...