భారతదేశం, మార్చి 31 -- Kakani Govardhan Reddy : వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం నెల్లూరు పోలీసులు గాలిస్తున్నారు. అక్రమ మైనింగ్‌, రవాణా కేసులో పోలీసులు కాకాణి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లగా..ఆయన అందుబాటులో లేరు. ఆయన ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు... ఇవాళ విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో తెలిపారు. అయితే పోలీసుల విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.

పొడలకూరు మండలంలో అక్రమ మైనింగ్ , రవాణా జరిగిందన్న ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి తో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని ఇప్పటికే రెండుసార్లు కాకాణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని తాజా నోటీసుల్లో పేర్కొన్నారు. స్వయంగా ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు...