Hyderabad, ఫిబ్రవరి 17 -- ధాబా స్టైల్ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వాటిని సింపుల్‌గా ఇంట్లో కూడా వండుకోవచ్చు. ఇక్కడ మేము కాజు కర్రీని ధాబా స్టైల్ లో ఎలా వండాలో ఇచ్చాము. దీన్ని వేడి వేడి అన్నంలోనే కాదు. చపాతీ, రోటీతో తిన్నా రుచిగా ఉంటుంది. దీనిలో గ్రేవీ అధికంగా ఉంటుంది. కాజు గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకోండి.

జీడిపప్పులు - పదిహేను

ఉల్లిపాయలు - మూడు

వెల్లుల్లి రెబ్బలు - పది

పచ్చిమిర్చి - అయిదు

టమోటోలు - రెండు

ఉప్పు- రుచికి సరిపడా

నెయ్యి - రెండు స్పూన్లు

లవంగాలు - నాలుగు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

బిర్యానీ ఆకు - రెండు

అనాసపువ్వు - ఒకటి

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

నూనె - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

పెరుగు - రెండు స్పూన్లు

కసూరి మేథి - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

పుదీ...