భారతదేశం, ఫిబ్రవరి 2 -- క్రయ, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయాల్సి ఉంటుంది. కానీ ఓ అధికారి మాత్రం టీ కొట్టునే రిజిస్ట్రార్ ఆఫీసుగా మార్చుకున్నారు. రిజిస్ట్రేషన్ దస్త్రాలపై అక్కడే సంతకాలు పెట్టేశారు. ఆ అధికారి టీ దుకాణంలోనే ఫైల్స్‌పై సంతకాలు చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు.. ప్రజలకు సంబంధించిన దస్తావేజులను పట్టణ శివారులోని ఒక టీ హోటల్లోకి తెప్పించుకున్నారు. అక్కడే సంతకాలు చేయడం విమర్శలకు దారి తీసింది. శుక్రవారం ఆయన సెలవులో ఉన్నారు. భూముల మార్కెట్ విలువ పెరిగిన దృష్ట్యా.. క్రయ విక్రయాల కోసం ప్రజలు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చారు. సుమారు 130కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన సెలవులో ఉంటూనే.. దళారీ...