భారతదేశం, ఫిబ్రవరి 15 -- తమిళ మూవీ 'కాదలిక్క నేరమిళ్లై' చిత్రం ఈ వారంలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. నిత్యా మీనన్, రవిమోహన్ లీడ్ రోల్స్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం డిసెంబర్ 20న తమిళంలో థియేటర్లలో రిలీజైంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఎలా ఉందో.. మెప్పిస్తుందా అనే విషయాల ఈ రివ్యూలో తెలుసుకోండి.

చెన్నైలోని ఓ కంపెనీలో ఆర్టిటెక్చర్‌గా పని చేస్తుంటుంది శ్రియ (నిత్యా మీనన్). ప్రేమలో ఉన్న ఆమె త్వరగా పెళ్లి చేసుకొని, పిల్లలను కనాలని ఆశిస్తుంది. తాను ప్రేమిస్తున్న కరణ్ (జాన్ కొక్కెన్) మోసం చేస్తున్నాడని తెలుసుకొని అతడితో విడిపోతుంది. మరోవైపు, స్ట్రక్చరల్ ఇంజినీర్ సిద్ధార్థ్ (రవి మోహన్).. నిరుపమ (భాను)ను ప్రేమిస్తుంటాడు. ఇద్దరి మధ్య పిల్లలను...