భారతదేశం, ఫిబ్రవరి 8 -- జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. సీఎం ర‌మేష్ లేఖాస్త్రాన్ని సంధించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంంలో అసాంఘిక కార్య‌క్రమాలు పేట్రేగిపోతున్నాయ‌ని, వాటిని అడ్డుకోవాల‌ని క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీల‌కు ఈనెల 2న‌ లేఖలు రాశారు. ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి అనుచ‌రుడుగా పేరొందిన దేవ‌గుడి నాగేశ్వ‌ర్ రెడ్డి నేతృత్వంలో.. రిప‌బ్లిక్ క్ల‌బ్‌లో అనధికార‌, అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్న‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌తి రోజూ ఉద‌యం 10 గంట‌ల నుండి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు పేకాట ఆడుతున్నారని ఆరోపించారు. మొత్తం 11 టేబుల్స్ ఉండ‌గా.. ఒక్కొక్క టేబుల్‌కు రూ.25 వేల నుంచి ల‌క్ష రూపాయాల వ‌ర‌కు బెట్టింగ్ వసూలు చేస్తున్నట్టు లేఖ‌లో ఆరోపించారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు మండ‌లంతో పాటు క‌డ‌ప జిల్లా స‌రిహ‌ద్దు ప్రాంతాల‌లో....