భారతదేశం, మార్చి 27 -- Kadapa Pocso Case: 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థినులను వేధించాడు. వారి ఇన్‌‌స్టా గ్రామ్‌ ఖాతాలను హ్యాక్‌ చేయడంతో పాటు వేధింపులకు పాల్పడ్డాడు. గత వారం స్కూల్లో ఈ విషయం బయటపడటంతో ఉపాధ్యాయుడు మందలించి దండించారు.

తరగతిలో తమ కుమారుడిని ఉపాధ్యాయుడు అకారణంగా కొట్టారంటూ బాలుడి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో విద్యార్థి నిర్వాకం, తల్లిదండ్రుల తీరు బయటపడటంతో వారిపై కేసు నమోదు చేశారు.

కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన 9వ తరగతి చదివే బాలుడు తనతో చదువుకునే బాలికల ఇన్స్టా గ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశాడు. అదే తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థినుల ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఫొటోలను సేకరించాడు. ఆ ఫోటోలను మగపిల్లలకు పంపి వారిని వేధిస్తున్నాడు. బాలుడి నిర్వాకం తెలియడంతో గత వారం టీచర్లు అతడిని...