Hyderabad, మార్చి 24 -- 2024 అక్టోబర్‌లో విద్యా బాలన్ తన బరువు తగ్గింపు గురించి మాట్లాడుతూ, తన కొత్త డైట్ గురించి వెల్లడించింది. జిమ్‌కు వెళ్ళకుండానే ఆమె ఎలా బరువు తగ్గిందో చెప్పింది. ఇప్పుడు, మార్చి 22న హీరోయిన్ జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల్ తన డైట్ సీక్రెట్ గురించి రివీల్ చేసింది. ఇందుకు కారణం విద్యా బాలన్ అంటూ చెప్పుకొచ్చింది. జ్యోతిక బరువు తగ్గడానికి విద్యాబాలన్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా ఆగండి.

గతంలో జ్యోతిక తాను ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా శరీర బరువును తగ్గించలేకపోతున్నాని అన్నారు. దీంతో విద్యా బాలన్ తనను పోషకాహార నిపుణులు, ఫిట్‌నెస్ నిపుణుల బృందాన్ని జ్యోతికకు పరిచయం చేసిందట. విద్యా బాలన్ లాగే ఈమె కూడా తన డైట్, ఫిట్‌నెస్‌లో మార్పులు చేసుకుని కేవలం '3 నెలల్లోనే 9 కిలోల బరువు తగ్గ...