భారతదేశం, జనవరి 31 -- Jyothi Rai: జ్యోతిరాయ్ కిల్ల‌ర్ మూవీ నుంచి రొమాంటిక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి పూర్వాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌డే ఈ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. జ్యోతిరాయ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో విశాల్ రాజ్‌, గౌత‌మ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తోన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా కిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఏఐ కాన్సెప్ట్‌తో తెలుగులో వ‌స్తోన్న తొలి మూవీ ఇద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

ఇందులో జ్యోతిరాయ్ కిల్ల‌ర్‌గా, మోడ్ర‌న్ గ‌ర్ల్‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌మోష‌న‌ల్ పోస్ట‌ర్స్ చూస్తుంటే తెలుస్తోంది. కిల్ల‌ర్ మూవీతోనే తెలుగులో హీరోయిన్‌గా జ్యోత...