Hyderabad, ఫిబ్రవరి 6 -- Jurassic World Rebirth Trailer Telugu: చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ఆకట్టుకునే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో హాలీవుడ్ సినిమాల గురించి ఎక్కవగా తెలియని తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా జురాసిక్ పార్క్. 1993లో వచ్చిన ఈ సినిమా అబ్బురపరిచి వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

వేల సంవత్సారల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్ తిరిగి భూమ్మీదకు వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. అయితే, హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ తెరకెక్కిన జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఎన్నో సినిమాలు వచ్చిన ఆ రేంజ్‌లో ఆకట్టుకోలేదు. కానీ, సినిమాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

2022లో చివరిగా వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ మాత్రం మంచి ఫలితాలే సాధించింది. బ...