భారతదేశం, డిసెంబర్ 5 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు తీసుకు వస్తుంది. డిసెంబర్ 5 అంటే ఈరోజు గురువు రాశి మార్పు చెందుతాడు. ఈరోజు గురువు మిథున రాశిలోకి ప్రవేశించి జూన్ 2, 2026 వరకు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. గురువు సంతోషం, జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికీ కారకుడు. గురువు సంచారంలో మార్పు జరిగినప్పుడు అది శుభ ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది.

గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆరు నెలల వరకు ఇదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. దీంతో మూడు రాశుల వారి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. నిజానికి అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు. డిసెంబర్ 5 అంటే ఈరోజు గురువు తిరోగమనం నుంచి మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఆ త...