Hyderabad, ఏప్రిల్ 2 -- జున్ను పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. జున్ను వండుకున్న తర్వాత స్పూన్ తో చిన్న ముక్కను అలా తీసి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. నిజానికి జున్ను మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఎంతోమందికి జున్ను తయారు చేయడం రాదు. మేము ఇక్కడ జున్ను రెసిపీ ఎలాగో ఇచ్చాము. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. పైగా తక్కువ సమయంలో అయిపోతుంది. జున్ను పాలను ఆంగ్లంలో చీజ్ మిల్క్ అని పిలుస్తారు.

జున్ను పాలు - ఒక గ్లాసు

సాధారణ పాలు - మూడు గ్లాసులు

బెల్లం తురుము - అరకప్పు

పంచదార - పావు కప్పు

యాలకుల పొడి - అర స్పూను

మిరియాల పొడి - ఒక స్పూను

1. జున్ను తయారు చేయడానికి ముందుగా జున్ను పాలను తీసుకోవాలి.

2. ఒక గిన్నెలో ఒక గ్లాసు జున్నుపాలు వేస్తే మూడు గ్లాసుల సాధారణ పాలు వేయాలి.

3. ఈ సాధారణ పాలను కాచి చల్లార్చి రెడీగా ఉ...