Hyderabad, ఫిబ్రవరి 3 -- ఇంట్లో కూరగాయలు లేకపోయినా, వంట చేయడానికి సమయం లేకపోయినా లేక రోజూ తినే ఆహారం బోక్ కొట్టిన టక్కున గుర్తొచ్చేది జంక్ ఫుడ్. బండి తీసామా, బయటకు వెళ్లామా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి తినేసామా! అంతే. ఇలా ఏదో ఒక కారణంతో ప్రస్తుతం జంక్ ఫుడ్ అనేది అందరి జీవనవిధానంలో భాగమైపోయింది. ఏదైమైనప్పటికీ బయట దొరికే ఈ ఆహారాలు కొన్ని సార్లు తినడంలో తప్పులేదు. ఇందులో కొందరు తప్పని పరిస్థితుల్లో తినేవారైతే మరికొందరు జంక్ ఫుడ్ అంటే ఇష్టంతో ఎక్కువసార్లు తింటున్నారు.

ముఖ్యంగా యువత, చిన్నారులు పిజ్జా, బర్గర్, మోమోస్, ఫ్రైస్ వంటి వాటిని రోజూ తినాలని కోరుకుంటున్నారు. జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇక్కడ వాస్తవం ఏంటంటే.. దీన్ని పూర్తిగా మన ఆహారం నుండి తొలగించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే కొంతమేరకు మాత్రమే తినాల చూసుక...