భారతదేశం, నవంబర్ 14 -- మరికాసేపట్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్లను లెక్కించనున్నారు. సరిగ్గా ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

కౌంటింగ్ తేదీ - 14 నవంబర్ 2025

కౌంటింగ్ టేబుల్స్ - : 42

కౌంటింగ్ రౌండ్లు: 10

మొత్తం పోలైన ఓట్లు: 1,94,631

పురుషులు: 99,771

మహిలలు: 94,855

ఇతరులు: 05

పోలింగ్ శాతం: 48.49 శాతం

నవంబర్ 11వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 48.49 పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.ఇందులో రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని 15 కేంద్రాల్లో, బోరబండ డివిజన్‌లోని 13, ఎర్రగడ్డలో 3, వెంగళరావునగర్‌లో ఒక చోట 60 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. ఈ ఉపఎన్నిక ఫలితాల్లో ఈ డివిజన్లలోని ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది.

కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ పరిశీలిస్తారు. అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఇతరులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉ...