భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. వీటిని ప్రస్తుతం లెక్కిస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఫలితంపై మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరికాసేపట్లో ట్రెండ్స్ తెలియనున్నాయి.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ వేళ విషాదం చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్‌ అన్వర్‌ (40) గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రగడ్డలో మహమ్మద్‌ అన్వర్ నివాసం ఉంటున్నారు.

పోస్టల్ ఓట్ల తర్వాత షేక్ పేట డివిజన్ ఓట్లను ముందుగా లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.

మరికాసేపట్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్లను లెక్కించనున్నారు. సరిగ్గా ఉదయం 8 ...