భారతదేశం, నవంబర్ 14 -- ఉపఎన్నిక ఫలితంపై కేటీఆర్ స్పందించారు. పారదర్శకంగా ఎన్నికలో పని చేశామన్నారు. ప్రజా సమస్యలను ప్రజల్లో చర్చకు పెట్టామని వివరించారు. తమ పోరాటం నిరంతరం కొనసాగుతోందన్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24658 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించిన నవీన్ యాదవ్. 24 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

నైతికంగానే తానే విజయం సాధించాని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలు కలిసి వచ్చాయని. రిగ్గింగ్ చేసి ఇక్కడ ఓడించారని ఆరోపించారు.

రిగ్గింగ్ తో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆరోపించారు. ఓ మహిళపై ఇంత అన్యాయం చేయటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. రౌడీ రాజ్యంగా ఈ ఉపఎన్నిక జరిగి...