Hyderabad, ఏప్రిల్ 16 -- Arjun Son Of Vyjayanthi Producers About Jr NTR Response: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.

ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

-కల్యాణ్ రామ్ గారితో ఒక సినిమా చేయాలనుకున్నాం. ఆయన ఎక్స్‌పరిమెంటల్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఆయనతో చేయాలని ఈ కథని సిద్ధం చేయించాం. కథ ఆలోచన దగ్గర నుంచి ప్రతిదీ కల్యాణ్ రామ్ గారి కోసం తయారుచేసినవే. మదర్ క్యారెక్ట...