భారతదేశం, ఏప్రిల్ 5 -- త‌న సపోర్ట్ లేకుండానే మంచి కథలు ఎంచుకుంటూ నితిన్ ముందుకి సాగుతున్నాడ‌ని ఎన్టీఆర్ అన్నారు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వప‌డుతున్నాన‌ని చెప్పాడు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో మ్యాడ్ 2 స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ వేడుక‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. మ్యాడ్ 2 టీమ్‌పై ఎన్టీఆర్ అభినంద‌న‌లు కురిపించాడు. దేవ‌ర 2, అదుర్స్‌తో పాటు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో చేయ‌బోతున్న సినిమాపై ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. క‌ళ్యాణ్ శంక‌ర్ అలాంటి వాడే. మ్యాడ్ 2 పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు...